Andhra news: సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు.

Updated : 18 Apr 2024 18:48 IST

అమరావతి: సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 44,163 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని, 1017 మందిని విధుల నుంచి తప్పించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.180 కోట్ల మేర నగదు, ఇతర వస్తువులను సీజ్‌ చేశామని వివరించారు. ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి ఘటనలో ఒకరిని అరెస్టు చేశారని మీనా తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసు ప్రత్యేక పరిశీలకుడు త్వరలోనే ఈసీకి నివేదిస్తారని, తదుపరి చర్యలు ఉంటాయన్నారు. అరకు, పాడేరు, రంపచోడవరంలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు. పాలకొండ, కురుపాం, సాలూరులో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు. రాష్ట్రంలోని మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు.

‘‘రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే ముగ్గురు పర్యవేక్షకులను ఈసీ నియమించింది. ఈనెల 22 వరకు హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 85 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఫారాలు ఇస్తాం. పోస్టల్‌ బ్యాలెట్‌ ఫారాలపై హోమ్‌ ఓటింగ్‌కు అనుమతి ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌కు అవకాశం. 67వేల మంది  సర్వీసు ఓటర్లకు వచ్చే నెల 5 నుంచి 10 వరకు బైపోస్టు ద్వారా అవకాశం. పోలింగ్‌ విధుల్లో 3.3లక్షల మంది సిబ్బంది ఉంటారు. రాష్ట్రానికి 300 కంపెనీల బలగాలు వస్తాయి. బలగాలతో కలుపుకొని 5.26లక్షల మంది విధుల్లో పాల్గొంటారు’’ అని సీఈవో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని