Chandrababu: రాష్ట్రాలు రెండైనా.. తెలుగువారంతా ఒక్కటే: చంద్రబాబు

తెలుగు రాష్ట్రాలు రెండైనా.. తెలుగువారంతా ఒక్కటేనని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

Published : 02 Jun 2024 18:10 IST

అమరావతి: రాష్ట్రాలు రెండైనా.. తెలుగువారంతా ఒక్కటేనని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘‘10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష. నాటి ఆర్థిక సంస్కరణల తర్వాత సంపద సృష్టికి బీజం పడింది. ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయి. నాలెడ్జ్‌ ఎకానమీతో అవకాశాలను అందిపుచ్చుకొని భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలి. రానున్న రోజుల్లో ఆర్థిక అసమానతలను నిర్మూలించి.. సమగ్ర సాధికారత సాధించాలి. రెండు రాష్ట్రాలు ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా తెలుగు ప్రజల విజయాలు, కీర్తి ప్రపంచవ్యాప్తం కావాలి. భారతదేశం స్వాత్రంత్యం సాధించి వందేళ్లు పూర్తి అయ్యే 2047 నాటికి ప్రపంచంలో భారతీయులు.. అందులోనూ తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలి’’అని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు