Medaram: మేడారంలో కొండెక్కిన కోడి ధర..

మేడారం మహా జాతరలో కోళ్ల ధరలు కొండెక్కాయి. బుధ, గురువారాల్లో లైవ్‌ కిలో కోడి రూ.150-200 మధ్య ఉండగా.. శుక్రవారం ఇది భారీగా పెరిగింది.

Updated : 23 Feb 2024 19:38 IST

ములుగు: మేడారం మహా జాతరలో కోళ్ల ధరలు కొండెక్కాయి. బుధ, గురువారాల్లో లైవ్‌ కిలో కోడి ధర రూ.150-200 మధ్య ఉండగా.. శుక్రవారం ఇది ఏకంగా రూ.500కు పెరిగింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో చాలా దుకాణాల్లో కోళ్లు అయిపోయాయి. సరఫరా తగ్గడంతో విక్రేతలు ధరలను అమాంతం పెంచేశారు. కోళ్లు అందుబాటులో లేకపోవడంతో కొందరు మటన్‌ కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆ దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. 

నిండుగా జాతర.. కనువిందు

మరోవైపు మేడారం మహాజాతర మూడో రోజుకు చేరుకుంది. సమ్మక్క గద్దెపైకి చేరడంతో జాతరకు నిండుదనం వచ్చింది. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరుకున్న విషయం తెలిసిందే. గురువారం సమ్మక్క రావడంతో మహిమాన్వితమైన గద్దెల ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. అటు జంపన్నవాగు జనసంద్రంగా మారింది. శుక్రవారం లక్షలాది మంది భక్తులు దర్శనానికి తరలివచ్చారు. అమ్మల దర్శనానికి ముందు జంపన్నవాగులో పుణ్యస్నానం చేయటం ఆచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు