Viral: చిట్టి చేతులు.. పెద్ద మనసు

కొవిడ్‌ రోగుల కోసం తన తల్లి సిద్ధం చేస్తున్న భోజనాల బాక్సులపై ఓ చిన్నారి రాసిన సందేశం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.  తన చిట్టి...

Updated : 19 May 2021 15:32 IST

సంతోషంగా ఉండాలంటూ భోజనాల బాక్సులపై రాసిన చిన్నారి
నెట్టింట వైరల్‌గా మారిన బాలుడి ఫొటో

ఇంటర్నెట్‌ డెస్క్: కొవిడ్‌ రోగుల కోసం తన తల్లి సిద్ధం చేస్తున్న భోజనాల బాక్సులపై ఓ చిన్నారి రాసిన సందేశం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.  తన చిట్టి చేతులతో ‘సంతోషంగా ఉండండి’అంటూ ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఆ బాలుడు రాసిన మాటలపై పలువురు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.  ఆకుపచ్చని టీషర్ట్‌ ధరించి..  పదుల సంఖ్యలో తన పక్కన ఉన్నఆహారపు డబ్బాల మూతలపై  ఆ రెండు మాటలతో పాటు సంతోషానికి ప్రతీకగా ఓ స్మైలీ చిత్రాన్ని ఆ బాలుడు గీశాడు. ఈ ఫొటోను నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారు.  ట్విటర్‌లో ఓ వ్యక్తి షేర్‌ చేసిన బాలుడి ఫొటోకు ఇప్పటికే 12 వేల లైకులు, 100 కామెంట్లు వచ్చాయి. కొవిడ్‌ ఉద్ధృతి రెండో దశ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఆ చిన్నారి పెద్ద మనసును అంతా మెచ్చుకుంటున్నారు. చాలా మందిలో ఈ చిత్రం ధైర్యం నింపేదిగా ఉందంటూ కొనియాడుతున్నారు.  ఇదే కాకుండా కష్టకాలంలో తోటివారిపై దయ చూపాలని కోరుతూ కెనడాకు చెందిన ఓ మహిళ పెట్టిన పోస్టుకు సైతం ఇలాంటి ప్రశంసలే దక్కాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని