ChinnaReddy: తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్‌ ఛైర్మన్‌గా చిన్నారెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి, పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్‌ జి.చిన్నారెడ్డి నియమితులయ్యారు.

Published : 24 Feb 2024 18:02 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం బోర్డు ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి, పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్‌ జి.చిన్నారెడ్డి నియమితులయ్యారు. కేబినెట్‌ మంత్రి హోదాలో చిన్నారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా గోపాల్‌పేట మండలం జయన్న తిరుమలపూర్‌ గ్రామానికి చెందిన జిల్లెల చిన్నారెడ్డి 1955లో జన్మించారు. ఉన్నత పాఠశాల విద్య వరకు వనపర్తిలో చదువుకున్నారు. 1970లో విద్యార్థి సంఘ నాయకుడిగా, ఆ తరువాత 1985లో రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ నేతగా ఉంటూ వనపర్తి టికెట్‌ సాధించి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మళ్లీ 1989లో పోటీచేసి మొదటిసారి గెలుపొందాడు. 2004లో వైఎస్‌ఆర్‌ మంత్రి వర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగానూ పని చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు