CM Jagan: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం జగన్‌ భేటీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల, ఏపీకి రావాల్సిన విద్యుత్‌ బకాయిలపై చర్చించారు.

Published : 05 Oct 2023 23:26 IST

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి(AP CM Jagan) భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు((Polavaram)కు నిధుల విడుదల, ఏపీకి రావాల్సిన విద్యుత్‌ బకాయిలపై చర్చించారు. సత్వరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, వీలైనంత త్వరగా ప్రాజెక్టు ఫలితాలు అందించేందుకు సహకరించాలని కోరారు. ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయంపై తాజా అంచనాలకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. 2017-18 ధరల సూచీ ప్రకారం వ్యయానికి ఆమోదం లభించిందని సీఎం జగన్‌ అన్నారు. ఇప్పటికే టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం లభించిందని, ప్రాజెక్టు వ్యయానికి ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. వరదల దృష్ట్యా తొలిదశ పనులపై అంచనాలు రూపొందించామని సీఎం జగన్‌ తెలిపారు. పోలవరం తొలిదశకు మరో రూ.17,144.06 కోట్లు విడుదల చేయాలని, ఇప్పటికే వెచ్చించిన రూ.1,355 కోట్లు రీఎంబర్స్‌ చేయాలని సీఎం కోరారు. అంతేకాకుండా ఏపీకి తెలంగాణ ప్రభుత్వం రూ.7,359 కోట్ల విద్యుత్‌ బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. అనంతరం కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను సీఎం జగన్‌ను కలిసి విద్యుత్‌ రంగంలోని పలు అంశాలపై చర్చించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని