CM Jagan: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం: జగన్‌

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నాలుగేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు.

Published : 28 Jun 2023 15:04 IST

కురుపాం: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నాలుగేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. పెత్తందారులకే అందుబాటులో ఉన్న చదువును పేద పిల్లల వద్దకు తీసుకొచ్చామని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ‘జగనన్న అమ్మఒడి’ నిధులను సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. స్కూళ్లలో టాయిలెట్స్‌ మెయింటెనెన్స్‌, అభివృద్ధి కోసం అమ్మఒడి నిధుల నుంచి రూ.2వేలు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులకు జగన్‌ విజ్ఞప్తి చేశారు.

‘‘పేదరికం కారణంగా ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదనే సంకల్పంతో పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్నాం. భావి తరాల భవిష్యత్తు కోసం విద్యపై పెట్టుబడి పెడుతున్నాం. ఈరోజు 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేశాం. దీంతో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ చదివే 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ నాలుగేళ్లలో విద్యా రంగంపై మన ప్రభుత్వం రూ.66,722.36 కోట్లు ఖ‌ర్చు చేసిందని చెప్పారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చదిద్దుతున్నాం. ప్రైవేట్‌ స్కూళ్లే సర్కారు విద్యాసంస్థలతో పోటీ పడే పరిస్థితిని కల్పించాం’’అని సీఎం అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని