Revanth Reddy: మనవడితో సీఎం రేవంత్‌ రెడ్డి హోలీ సంబరాలు

సీఎం రేవంత్‌ రెడ్డి తన నివాసంలో మనవడు రేయాన్స్‌తో కలిసి హోలీ ఆడారు.

Updated : 25 Mar 2024 19:07 IST

హైదరాబాద్‌: తెలంగాణలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నా, పెద్దా రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో మనవడు రేయాన్స్‌తో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. భార్య గీతారెడ్డితో కలిసి మనవడిపై రంగులు చల్లుతూ ఉత్సాహంగా కనిపించారు. తాత ఒళ్లో కూర్చుని రేయాన్స్ చిరునవ్వులు చిందించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సీఎం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘‘ పరిపాలన, రాజకీయం, విజ్ఞప్తులు, పరిష్కారాలు, సమావేశాలు, తీరిక లేని షెడ్యూల్ అన్నింటికీ కొంచెం విరామం. హోలీ నాడు.. మనవడితో ఆటవిడుపు’’ అంటూ రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని