CM Revanth Reddy: ప్రభుత్వ హామీని తొలిసారి అమలు చేసింది ఆర్టీసీ కార్మికులే: సీఎం రేవంత్‌

ప్రభుత్వ హామీని తొలిసారి అమలు చేసింది ఆర్టీసీ కార్మికులేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 10 Feb 2024 16:10 IST

హైదరాబాద్‌: ప్రభుత్వ హామీని తొలిసారి అమలు చేసింది ఆర్టీసీ కార్మికులేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. టీఎస్‌ ఆర్టీసీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన 100 ఆర్టీసీ బస్సులను శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర అని కొనియాడారు.

‘‘రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యలు పరిష్కారమవుతాయని వారు ఆశించారు.. కానీ, అలా జరగలేదు. సమస్యల పరిష్కారం కోసం  కార్మికులు చేసిన ఆందోళనలో 36 మంది చనిపోయారు. సమ్మెకు దిగారని ఆర్టీసీ కార్మిక సంఘాలను నాటి సీఎం రద్దు చేశారు.  ప్రజాప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాం. గత ప్రభుత్వం రూ.2.97లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. కానీ, మేం వాస్తవ లెక్కలతో బడ్జెట్‌ రూపొందించాం. గతేడాది కంటే రూ.15వేల కోట్లు తక్కువతో బడ్జెట్‌ ప్రవేశపెట్టాం’’అని సీఎం తెలిపారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు