CM Revanth: రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

వేసవిలో విద్యుత్‌, తాగునీటి సరఫరాపై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. 

Published : 30 Mar 2024 20:13 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వేసవిలో విద్యుత్‌, తాగునీటి సరఫరాపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పెరిగిన డిమాండ్‌కు తగినట్టు అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పంటలు ఎండిపోకుండా చూడాలన్నారు.

‘‘రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలి. జూన్‌ వరకు బోర్లు, బావులు, ఇతర స్థానిక నీటి వనరులు వాడుకోవాలి. తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. గ్రామాల వారీగా కార్యాచరణ తయారు చేయాలి. పర్యవేక్షణ కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వాటర్‌ ట్యాంకులు సిద్ధంగా ఉంచాలి. ట్యాంకర్లు బుక్‌ చేస్తే 12 గంటల్లోపు చేరేలా చూడాలి’’ అని సీఎం ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని