CM Revanth Reddy: గౌతమ బుద్ధుడి సందేశం అందరికీ అవసరం: సీఎం రేవంత్‌రెడ్డి

ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదని.. ప్రతి పనిని ధ్యానంగా చేయడాన్ని పాటించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

Published : 23 May 2024 13:57 IST

హైదరాబాద్‌: ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదని.. ప్రతి పనిని ధ్యానంగా చేయడాన్ని పాటించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. బుద్ధ పూర్ణిమ పురస్కరించుకుని ఆయన సికింద్రాబాద్‌లోని మహాబోధి బుద్ధ విహార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘నేను పని చేసేటప్పుడు ధ్యానంగా ఉంటా. సమాజంలో అశాంతి, అసూయలను అధిగమించాల్సిన బాధ్యత అందరిది. మంచి సందేశం, ఆలోచనను పెంపొందించుకోవాలి. సమాజానికి మేలు చేయాలన్న తలంపును ఇతరులకు పంచాలి. గౌతమ బుద్ధుడి సందేశం అందరికీ అవసరం. మహాబోధి బుద్ధ విహార్‌కు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. ధ్యాన మందిరం కోసం నిధులు కేటాయిస్తాం. ప్రతిపాదనలు పంపితే ఎన్నికల కోడ్‌ ముగిశాక నిధులు మంజూరు చేస్తాం’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని