Revanth Reddy: భద్రాద్రి రాములోరిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయానికి వెళ్లారు. ఆలయ ఈవో, వేదపండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు.

Updated : 11 Mar 2024 13:47 IST

భద్రాచలం: సీఎం రేవంత్‌రెడ్డి భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయానికి వెళ్లారు. ఆలయ ఈవో, వేదపండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రేవంత్‌రెడ్డి స్వామివారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వెంట మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ఉన్నారు. సీఎం భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని