Revanth reddy: చుక్కా రామయ్యను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి

ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు. విద్యానగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన సీఎం.. రామయ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Updated : 31 May 2024 00:33 IST

హైదరాబాద్‌:  ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కలిశారు. రామయ్య కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో గురువారం సాయంత్రం విద్యానగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన పెద్ద కుమార్తె ఉమను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామయ్యను శాలువాతో సన్మానించిన సీఎం.. జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. తమ పాలన ఎలా ఉందో చెప్పాలని అడిగిన సీఎం.. ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. విద్యారంగం సహా పలు అంశాలపై కాసేపు చర్చించినట్లు సమాచారం. అలాగే, ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో రామయ్యతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. సీఎం వెంట మల్లు రవి, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, స్థానిక కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని