TS news: స్టీఫెన్‌ రవీంద్రపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు

సైబరాబాద్‌ మాజీ సీపీ, ప్రస్తుత హోంగార్డ్స్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్రపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కమాండ్‌ కంట్రోల్‌ డీఎస్పీ గంగాధర్‌ ఫిర్యాదు చేశారు. 

Updated : 04 Apr 2024 13:30 IST

హైదరాబాద్‌: సైబరాబాద్‌ మాజీ సీపీ, ప్రస్తుత హోంగార్డ్స్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్రపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కమాండ్‌ కంట్రోల్‌ డీఎస్పీ గంగాధర్‌ ఫిర్యాదు చేశారు. తాను నార్సింగి సీఐగా ఉన్నప్పుడు భూ వివాదంలో జోక్యం చేసుకున్నానని ఆరోపిస్తూ రవీంద్ర సస్పెండ్‌ చేశారని పేర్కొన్నారు. భూ కబ్జాదారులతో చేయి కలిపి, ఎలాంటి విచారణ చేయకుండానే తనను సస్పెండ్‌ చేశారన్నారు. దీనివల్ల పదోన్నతి అవకాశం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పదోన్నతి అవకాశం పరిశీలించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ.. న్యాయస్థానం ఉత్తర్వులను స్టీఫెన్‌ రవీంద్ర లెక్క చేయలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పలువురు కిందిస్థాయి అధికారులను ఆయన ఇబ్బంది పెట్టారంటూ.. ఫిర్యాదు కాపీని సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, హోంశాఖ, డీవోపీటీకి పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని