Andhra news: కోడ్‌ అమల్లో ఉండగా టీచర్ల బదిలీ చట్టం ఎలా చేస్తారు?: ఏపీ ఉద్యోగుల సంఘం

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా పాఠశాల విద్యాశాఖలో టీచర్ల బదిలీ చట్టం చేస్తామంటూ కొందరు అధికారులు ప్రతిపాదించటంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సీఈవోకి ఫిర్యాదు చేసింది.

Updated : 29 May 2024 19:07 IST

అమరావతి: ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా పాఠశాల విద్యాశాఖలో టీచర్ల బదిలీ చట్టం చేస్తామంటూ కొందరు అధికారులు ప్రతిపాదించటంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సీఈవోకి ఫిర్యాదు చేసింది. శాసనసభ కాలపరిమితి ముగిశాక, శాసనకర్తలు లేకుండా అధికారులు చట్టం ఎలా చేస్తారంటూ ఉద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ సీఈవోకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీలపై చట్టానికి ప్రతిపాదించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

పాఠశాల విద్యాశాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న మొవ్వా రామలింగం సర్వాంతర్యామిలా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తూ పరిధి దాటారని ఫిర్యాదు చేశారు. బాధ్యులైన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల ఐక్యవేదిక కోరింది. ఈ చర్య ప్రత్యక్షంగా ఎన్నికల  కోడ్ ఉల్లంఘన అవుతుందని సూర్యనారాయణ ఫిర్యాదులో పేర్కోన్నారు. సీసీఏ రూల్స్ ప్రకారం పాఠశాల విద్యాశాఖ జేడీపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు