Hyderabad: టీఎస్‌పీఎస్సీ వద్ద ఆందోళన కేసు.. అశోక్‌కు బెయిల్

టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళన కేసులో అరెస్టు అయిన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్‌కు బెయిల్ మంజూరు అయ్యింది.

Published : 14 Aug 2023 19:19 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళన కేసులో అరెస్టు అయిన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్‌కు బెయిల్ మంజూరు అయ్యింది. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులను రెచ్చగొట్టి టీఎస్‌పీఎస్సీ భవనం వద్ద ఆందోళన చేయించాడని ఆయణ్ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వాట్సప్‌తోపాటు పలు సామాజిక మాధ్యమాల్లో టీఎస్‌పీఎస్సీ భవనం వద్దకు లక్ష మంది రావాలని అశోక్‌ పిలుపునిచ్చారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఆందోళన జరిగిన రోజే అశోక్‌ను అరెస్టు చేసిన బేగంబజార్‌ పోలీసులు జైలుకు తరలించారు. తాజాగా అశోక్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రెండు నెలల పాటు ప్రతి గురువారం బేగంబజార్ ఠాణాలో సంతకం చేయాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని