Bhadradri - Kondagattu: భద్రాద్రి, కొండగట్టు ఆలయాల్లో భక్తుల రద్దీ

భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో అధిక సంఖ్యలో భక్తులు  స్వామివారిని దర్శించుకుంటున్నారు.

Updated : 27 Jan 2024 19:34 IST

భద్రాచలం, కొండగట్టు: భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ లక్ష్మణ సమేత సీతారాములకు ఆలయ అర్చకులు బంగారు తులసీదళాలతో అర్చన చేశారు. రద్దీ నెలకొనడంతో నిత్య కల్యాణ వేడుకను.. చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్నారు. ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికీ భక్తులు పోటెత్తారు. శనివారం, మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూలైన్‌లు నిండి వెలుపల వరకు బారులు తీరారు. వందలాది వాహనాలతో ఘాట్‌ రోడ్డు, ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని