Indrakiladri: ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. రోజుకు 50 వేల మందికి దర్శనం

వేసవి సెలవుల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది.

Published : 22 May 2024 18:16 IST

విజయవాడ: వేసవి సెలవుల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. భవానీదీక్షలు, దసరా నవరాత్రుల తరహాలో రోజుకు సుమారు 50 వేల మంది భక్తులు వస్తున్నారు. మండే ఎండలను లెక్క చేయకుండా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీంతో రూ.25 లక్షల దాకా టిక్కెట్ల ఆదాయం జమ అవుతోంది. ఎక్కువ శాతం మంది తమ సొంత వాహనాలతో వస్తుండడం వల్ల పార్కింగ్‌ సమస్య ఉత్పన్నమవుతోంది. కనకదుర్గానగర్‌లో అభివృద్ధి పనుల కారణంగా పార్కింగ్‌ స్థలం కొరత ఏర్పడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని