AP Govt: సెలవు పెట్టి వెళ్లిపోయిన జవహర్‌రెడ్డి.. సాయంత్రంలోపు కొత్త సీఎస్‌?

ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సెలవుపై వెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జవహర్‌రెడ్డి(Jawahar Reddy)ని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది.

Updated : 06 Jun 2024 15:32 IST

అమరావతి: ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సెలవుపై వెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జవహర్‌రెడ్డి(Jawahar Reddy)ని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. దీంతో ఆయన సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఈ నెలాఖరును ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ కూడా సెలవుపై వెళ్లారు. అనారోగ్య కారణాలతో లీవ్‌ పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. జవహర్‌రెడ్డి సెలవుపై వెళ్లిన నేపథ్యంలో సాయంత్రంలోపు కొత్త సీఎస్‌ను నియమించే అవకాశముంది. మరోవైపు ఇప్పటికీ రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముంది.

టీచర్ల బదిలీ ఉత్తర్వులు నిలిపివేత

రాష్ట్రంలో టీచర్ల బదిలీలపై ఎన్నికల కోడ్‌కు ముందు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేశారు. ఎలాంటి బదిలీలు చేపట్టవద్దని డీఈవోలను ఆదేశించారు. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలకు ముందు మొత్తం 1800 మంది టీచర్లను బదిలీ చేయాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సీఎం పేషీలోని కొందరు అధికారుల ఒత్తిడితో పైరవీలు, సిఫార్సులు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని