TS News: బ్లూ బుక్‌ ప్రకారం ప్రధాని మోదీ పర్యటనకు బందోబస్తు: సీఎస్‌

తెలంగాణలో మార్చి 4, 5 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటనకు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖలను సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు.

Published : 29 Feb 2024 23:41 IST

హైదరాబాద్‌: తెలంగాణలో మార్చి 4, 5 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖలను సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. మార్చి 4న ఆదిలాబాద్, 5న సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు రెండు చోట్ల బహిరంగ సభల్లో  ప్రధాని పాల్గొంటారని తెలిపారు.

బ్లూ బుక్‌ ప్రకారం ప్రధాని పర్యటనకు భద్రత, ట్రాఫిక్‌, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. విమానాశ్రయం, హెలిప్యాడ్‌లతోపాటు అన్ని వేదికల వద్ద అగ్నిమాపక వాహనాలు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాని కాన్వాయ్‌ వెళ్లే మార్గాల్లో రోడ్లు పరిశీలించి మరమ్మతులు అవసరమైతే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఆయన పర్యటించే ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని సూచించారు. సమావేశంలో డీజీపీ రవిగుప్తా, వివిధ శాఖల ఉన్నతాధికారులు జితేందర్, నాగిరెడ్డి, రఘునందన్ రావు, క్రిస్టినా, సురేంద్ర మోహన్, హనుమంతరావు, రోనాల్డ్ రోస్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని