Cyclone Remal: ఆంధ్రప్రదేశ్‌పై ‘రేమాల్‌’ తుపాను ప్రభావం ఉండదు: వాతావరణశాఖ

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Updated : 24 May 2024 16:19 IST

అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుపానుకు ‘రేమాల్’గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. అది ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్‌ వద్ద 27వ తేదీ అర్ధరాత్రి దాటాక తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒడిశా, బంగాల్‌, బంగ్లాదేశ్‌పై తుపాను ప్రభావం ఉంటుందని తెలిపారు. మధ్య బంగాళాఖాతంలో సముద్రం ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని సూచించారు. 

 అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు విశాఖ వాతావరణశాఖ అధికారి డాక్టర్‌ సునంద తెలిపారు. తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉండదని, అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వివరించారు. తుపాను ప్రభావంతో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు శ్రీలంక వరకు విస్తరించాయని వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని