Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03/12/22)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Published : 03 Dec 2022 00:47 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ప్రారంభించిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. లక్ష్మీఆరాధన, కనకధారాస్తవం చదవాలి.

ప్రయత్నకార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

 

పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి  విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

సంపూర్ణ అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

ప్రారంభించబోయే పనుల్లో క్రమశిక్షణ చాలా అవసరం. అనవసర ఖర్చులు సూచితం. ఎవరితోనూ అనవసర చర్చలు చేయకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సాయి సందర్శనం ఉత్తమం.

మంచిపనులు చేస్తారు. వృత్తి,ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిరనిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. గోవింద నామాలు చదవడం మంచిది.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది..

మంచి ఫలితాలు ఉన్నాయి. మీ పనుల్లో బంధుమిత్రులుసాయపడతారు. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పంచముఖ ఆంజనేయస్వామి సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.

 

ప్రారంభించబోయే పనుల్లో క్రమశిక్షణ చాలా అవసరం. అనవసర ఖర్చులు సూచితం. ఎవరితోనూ అనవసర చర్చలు చేయకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి.సాయిసందర్శనం ఉత్తమం.

మిశ్రమ వాతావరణం ఉంటుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు.నవగ్రహ శ్లోకాన్ని చదవాలి.

కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు. ఒకటీరెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని