Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/09/21)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Updated : 14 Sep 2021 04:00 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవిష్ణు ఆరాధన మంచిది.

మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు.శివపార్వతులను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్ప ఆలోచనా విధానంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివ అష్టోత్తరం పఠించాలి.
 

ఉత్సాహంగా పనిచేయాలి. శ్రమ పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం. 

చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొంటారు. సూర్యాష్టకం పఠించడం మంచిది.

చేపట్టిన కార్యక్రమాలను మనోబలంతో పూర్తిచేస్తారు. ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. గోసేవ చేయడం మంచిది.

చేపట్టే పనులలో ఆటంకాలు కలుగకుండా వ్యవహరించాలి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శరీర సౌఖ్యం కలదు. సూర్యాష్టకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

శుభకాలం. విశేషమైన ప్రగతి సాధిస్తారు. ఆశయాలు నెరవేరుతాయి. సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు. శివారాధన శుభాన్ని కలిగిస్తుంది.

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చుల వైపు మనసు మళ్లుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. శ్రీలక్ష్మీ గణపతి ధ్యానం మంచిది.

 

ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది.

అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉన్నారు. శ్రమ అధికం అవుతుంది. తోటివారి సహకారంతో ఆపదలు తొలుగుతాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శివారాధన మంచిది.

ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. నారాయణ మంత్రాన్ని జపించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు