Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
మేషం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ఫర్వాలేదనిపిస్తుంది.పెద్దల సలహాలు పనిచేస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. గోసేవ చేయడం మంచిది.
వృషభం
ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మనస్సు చెడు విషయాలపైకి మళ్లకుండా జాగ్రత్త పడాలి. దుర్గాస్తుతి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
మిథునం
మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది.
కర్కాటకం
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. పనులకు ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతం అవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం.
సింహం
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. గిట్టనివారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలను అందుకుంటారు. శ్రీవేంకటేశ్వర సందర్శనం ఉత్తమం.
కన్య
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
తుల
కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. మిత్రజన సహకారం ఉంది. శ్రీలక్ష్మీస్తుతి శ్రేయస్కరం.
వృశ్చికం
శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. దైవారాధన మానవద్దు.
ధనుస్సు
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణ శుభప్రదం.
మకరం
కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువగా శ్రమించాలి. బంధువుల అండదండలు ఉంటాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం.
కుంభం
మీదైన రంగంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. లాభ చంద్ర సంచారం అనుకూల లాభాలను ఇస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవారాధన మంచిది.
మీనం
మంచి పనులు చేస్తారు. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీకు అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆగ్రహావేశాలకు పోవద్దు. తోటివారితో సానుకూలంగా వ్యవహరిస్తే మేలు. శనిధ్యానం చేయాలి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో నిప్పులు చెరిగిన భానుడు
రాష్ట్రంలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్‌ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో భారాస నేత క్రిశాంక్, ఓయూ విద్యార్థి నాగేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శంషాబాద్‌లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లోకి వచ్చిన చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఇకపై సన్ నెక్స్ట్..
-
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
-
గూగుల్‌తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్‌ను ఎలా వాడాలి?
-
లైంగిక దౌర్జన్యం కేసు - తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
-
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
-
నీ డెబ్యూ నాటికి నేనింకా చెడ్డీలతోనే ఉండుంటా: మిశ్రాతో రోహిత్