Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)

ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు

Updated : 20 Apr 2024 04:38 IST

మేషం

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. దైవారాధన మానవద్దు.

వృషభం

మీ మీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి.  ముఖ్యమైన విషయాల్లో కుటుంబసభ్యుల సలహాలు పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. విష్ణు సందర్శనం శుభప్రదం.

మిథునం

శుభసమయం. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహాయసహకారాలు అందుతాయి. దుర్గాదేవి దర్శనం శుభప్రదం.

కర్కాటకం

తోటివారి సూచనలను పాటించడం ఉత్తమం. మీ మీ రంగాల్లో మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకండి. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యసాధ్యాలను అంచనా వేయవచ్చు. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

సింహం

వృత్తి,ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. గోవిందనామాలు చదవడం మంచిది.

కన్య

ఉత్సాహంగా పనిచేయాలి. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. శ్రీలక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

తుల

ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తోంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. శ్రీసూర్యనారాయణమూర్తి ఆరాధన శుభదాయకం.

వృశ్చికం

కార్యసిద్ధి ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు వస్తాయి. అనవసర విషయాల గురించి సమయాన్ని వృథా చేయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

ధనుస్సు

ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగండి, మంచి జరుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి. హనుమత్ ఆరాధన శుభప్రదం.

మకరం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ముందుకు సాగండి, అనుకూల ఫలితాలు వస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

కుంభం

అనుకూల సమయం. తోటి వారి నుంచి సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు.  ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

మీనం

ప్రారంభించబోయే పనుల్లో అంతా మంచే జరుగుతుంది. మనః సంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని