Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/04/24)

ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Updated : 21 Apr 2024 01:25 IST

మేషం

మీ మీ రంగాల్లో శుభ ఫలితాలు వెలువడతాయి. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. శ్రీఆంజనేయ ఆరాధన మంచిది.

వృషభం

బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ ధ్యానం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

మిథునం

ఒక శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. శివుడిని ఆరాధించాలి.

కర్కాటకం

వృత్తి.ఉద్యోగ,వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు,వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.  

సింహం

వృత్తి,ఉద్యోగ,వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పనులను ప్రారంభించే ముందు మంచీచెడులను ఆలోచించి ముందుకు సాగండి. కీలక వ్యవహారాలలో ముందుచూపు అవసరం. దైవబలం రక్షిస్తోంది. విష్ణు సందర్శనం శుభప్రదం.

కన్య

ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించిన  పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. గణపతి స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది.

తుల

ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులతో మాత్రం అంటీముట్టనట్టు ఉండటమే మంచిది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది. 

వృశ్చికం

శుభ ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు శుభప్రదం. ఇష్టదేవతను ఆరాధిస్తే మంచిది. 

ధనుస్సు

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శివారాధన శుభప్రదం. 

మకరం

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కొన్ని పనులను ప్రారంభించి పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పకపోవచ్చు. వృథా ఖర్చులు ఉన్నాయి. గోసేవ చేయాలి. 

కుంభం

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రం చదివితే మంచిది.

మీనం

ప్రారంభించిన కార్యక్రమాలకు ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. సూర్యారాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని