Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు..12 రాశుల ఫలితాలు ఇలా... (05/04/24)

  Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 05 Apr 2024 00:14 IST

మేషం

ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు అందుతుంది. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీషణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

వృషభం

శుభకాలం. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ముఖ్య పనులను ప్రారంభించడానికి ఇది  సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. శ్రీలక్ష్మీదేవి సందర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. 

మిథునం

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి.      శివుడిని ఆరాధిస్తే మంచిది.

కర్కాటకం

మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాటపడాల్సి వస్తుంది. సహనం కోల్పోరాదు. నిదానంగా అన్నీసర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శ్రీలక్ష్మీ సహస్రనామ పారాయణ శుభకరం.

సింహం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. కీలక సమయాలలో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్థికంగా మేలైన సమయం. ఇష్టదేవత  సందర్శనం ఉత్తమం.

కన్య

భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ప్రతిభ,పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. శ్రీసాయిబాబా సచ్చరిత్ర చదివితే బాగుంటుంది.

తుల

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులతో జాగ్రత్త. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శక్తిని ఇస్తుంది.

వృశ్చికం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.ఈశ్వర సందర్శనం ఉత్తమం.

ధనుస్సు

ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే  ప్రయత్నం చేస్తారు. మనోధైర్యంతో చేసే పనులు కీర్తిని తెచ్చిపెడతాయి. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.

మకరం

దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.  

కుంభం

మీ మీ రంగాల్లో శుభఫలితాలను అందుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

మీనం

మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని