Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/12/23)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది.  డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.   

Updated : 06 Dec 2023 00:24 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మిశ్రమ కాలం. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కీలక పనులను మధ్యాహ్నం తరువాత చేయడం మేలు.  లక్ష్మీధ్యానం శుభప్రదం.

మొదలుపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. ఇష్టదేవతా  శ్లోకం చదవాలి.

మనఃసౌఖ్యం ఉంటుంది. యశోవృద్ధి ఉంటుంది. కుటుంబ సహకారంతో చేసే పనులు మేలు చేస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను పూర్వాహ్ణంలో చేస్తే మేలు. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

అభివృద్ధికై చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది.  నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

కార్యవిఘ్నం కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. తోటివారిని కలుపుకొనిపోతే పనులు త్వరగా పూర్తవుతాయి. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచిది.

మేలైన ఫలితనాలున్నాయి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో శుభఫలాన్ని అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తిచేస్తారు. ఇష్టదైవం ధ్యానం శుభప్రదం. 

ప్రయత్నకార్యానుకూలత ఉంది. అలసట చెందకుండా చూసుకోవాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ఆంజనేయ స్వామిని ఆరాధించాలి.

మొదలుపెట్టిన పనులలో ఆటంకాలను అధికమిస్తారు. మీ ప్రతిభకు  ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.

 చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే మంచిది.

 

పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. మొహమాటంతో  ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.

మిశ్రమఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో ఆచి తూచి వ్యవహరించాలి.  కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి.  వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. దుర్గాదేవి నామాన్ని జపించడం ఉత్తమం.

 శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని