Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/12/2023)

  Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 05 Dec 2023 00:05 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో చక్కటి ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. దుర్గాదేవి సందర్శనం శుభప్రదం.

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. తోటివారి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

చేపట్టిన పనుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి, అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఒక ముఖ్యమైన సమస్యను చాకచక్యంగా పరిష్కరిస్తారు. గురువుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి.

ద్వితీయ చంద్రబలం అనుకూలంగా లేదు. శ్రమ పెరుగుతుంది. అందరినీ కలుపుకొనిపోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే బాగుంటుంది.

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ దైవానుగ్రహంతో వాటిని సమర్ధంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

మొదలుపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుంది. బుద్ధిబలంతో సమస్యలు తొలుగుతాయి. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మేలు.

మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ధన,ధాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. తోటి వారి సహకారంతో సత్ఫలితాలను సాధిస్తారు. ఎట్టి పరిస్థితిల్లోనూ మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శ్రీలక్ష్మీ నామాన్ని జపించడం ఉత్తమం.

ప్రయత్న కార్యసిద్ధి కలదు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విందు, వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. బంధుప్రీతి కలదు. ఇష్టదైవ నామస్మరణ శుభకరం.

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో మేలైన ఫలితాలు ఉన్నాయి. శత్రువులపై నైతిక విజయం సాధిస్తారు. ముఖ్య విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే వివాదాలు చుట్టుముడతాయి. ఎవరినీ అతిగా నమ్మకండి. శనికి తైలాభిషేకం శుభప్రదం.

 

ప్రారంభించిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధు,మిత్రుల సహకారం మేలు చేస్తుంది. నవగ్రహ స్తోత్రం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి.

మీలోని చిత్తశుద్ధే మీ విజయానికి మూలం అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విఘ్నాల్ని కలిగించేవారు పక్కనే ఉంటారు. ఆదిత్య హృదయం చదివితే మంచిది.

మీ మీ రంగాల్లో సమర్ధంగా ముందుకు సాగి విజయం సాధిస్తారు. తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. సమాజంలో మంచి పేరుప్రఖ్యాతలు వస్తాయి. శ్రీసుబ్రహ్మణ్య స్వామి సందర్శనం శుభప్రదం.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని