Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/02/24)

 ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.  

Updated : 28 Feb 2024 06:37 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. భక్తి శ్రద్ధలతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. ధర్మసిద్ధి ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని  ఆరాధించాలి.

మీ కృషి ఫలిస్తుంది. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవ్వరితోనూ వాదోపవాదాలు చేయకండి. లలితా దేవిని స్తుతిస్తే అంతా మేలు జరుగుతుంది.

కొన్ని సందర్భాల్లో  అస్థిర బుద్దితో వ్యవహరిస్తారు. మనోనిబ్బరం అవసరం.  అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీల విషయంలో నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు.  ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.

గొప్ప  సంకల్పబలంతో  ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. అభివృద్ధికై చేసే ప్రయత్నాలు  ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

చేపట్టే పనుల్లో దేహజాఢ్యాన్ని రానీవ్వకండి. విఘ్నాలు ఎదురవుతాయి. చంచల బుద్ధితో ఇబ్బంది పడతారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి.  ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదు. శ్రీహరిని  ఆరాధిస్తే మంచిది.

గ్రహబలం అనుకూలిస్తోంది. అభివృద్ధికై చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

మానసికసౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.  బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.

మీ మీ రంగాల్లో అనుకున్నఫలితాలు సొంతమవుతాయి. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది కనకధారాస్తవం పఠించాలి.

 

మనస్సౌఖ్యం కలదు.  శుభ  కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచినిస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి.

మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.  ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరగటానికి  విష్ణు  ధ్యానం శుభప్రదం.

ముఖ్య విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి.  కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. శివనామాన్ని జపించడం ఉత్తమం.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని