Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/02/2024)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 13 Feb 2024 00:16 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ప్రారంభించిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్దిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.

ధర్మసిద్ధి ఉంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. గతంలో ఆగిన పనులు పూర్తవుతాయి. శ్రీమహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.

సమయాన్ని అభివృద్ధి కోసం కేటాయించండి. శ్రమ పెరగకుండా ప్రణాళికలను తయారు చేసుకోవాలి. మరువలేని విజయాలు సొంతం అవుతాయి. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దుర్గాధ్యాన శ్లోకం చదవండి.

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వృత్తి,వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. శ్రీవేంకటేశ్వరుని పూజించడం వల్ల ఆపదలు తొలగుతాయి.

మీ ప్రతిభ,పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది. 

ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడం చేస్తే మంచిది.

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శత్రువుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. సౌమ్యంగా ముందుకు సాగాలి. చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. బంధు,మిత్రులతో కొన్ని వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. ఇష్టదేవతా స్తోత్రం చదవడం మంచిది.

శుభ సమయం. వృత్తి,ఉద్యోగాల్లో మేలు చేకూరుతుంది. ముఖ్య విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది.

 

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీకు అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే బాగుంటుంది.

ప్రారంభించబోయే పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు. వాటిని ప్రారంభించడంలో చిన్నచిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.

మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు