Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/06/24)

ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Updated : 04 Jun 2024 00:14 IST

మేషం

చేపట్టే పనిలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ముఖ్యమైన పనులుచేసే ముందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. దైవబలం రక్షిస్తుంది. శుభకార్యాక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. లక్ష్మీస్థితి అదృష్టాన్నిస్తుంది. 

వృషభం

తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. పెద్దలతో మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు మనసులో అనుకుని మాట్లాడటం మంచిది. ద్వాదశంలో చంద్రుడు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్నారు. మనశ్శాంతి కోసం ఈశ్వర ఆరాధనచేయండి.

మిథునం

మనోబలంతో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. లాభంలో చంద్రబలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈశ్వర ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

కర్కాటకం

మీ మీ రంగాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు. నిండు మనసుతో పనులను పూర్తిచేసి ప్రశంసలనుఅందుకుంటారు. తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. నవంలో చంద్రబలం అనుకూలంగా లేదు. ఎవరిని అతిగా నమ్మిమోసపోరాదు. దుర్గా ధ్యానం చేస్తే మంచిది.

సింహం

మీ మీ రంగాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు. నిండు మనసుతో పనులను పూర్తిచేసి ప్రశంసలనుఅందుకుంటారు. తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. నవంలో చంద్రబలం అనుకూలంగా లేదు. ఎవరిని అతిగా నమ్మిమోసపోరాదు. దుర్గా ధ్యానం చేస్తే మంచిది.

కన్య

కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. నిరుత్సాహపడకుండా పనిచేస్తే విజయానికి చేరువవుతారు. విమర్శకుల మాటలను పట్టించుకోరాదు. అష్టమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. సూర్యనారాయణ మూర్తి సందర్శనం శ్రేయదాయకం.

తుల

చేపట్టే పనిలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ఎదుర్కొంటారు. విజయం వరిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. ఎవర్నీ అతిగా నమ్మి మోసపోకండి. ప్రయాణంలో జాగ్రత్త. శివ ధ్యానం చేస్తే మంచిది. 

వృశ్చికం

చక్కటి ఆలోచన విధానంతో భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో కీలకనిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడంమంచిది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మాట పట్టింపులకుపోరాదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం మంచినిస్తుంది.

ధనుస్సు

సంపూర్ణ ఆత్మబలంతో విజయ సిద్ధి కలదు. మీ మీ రంగాల్లోప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు. పంచమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. అస్థిర నిర్ణయాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అపార్థాలకు తావివ్వకండి. ఆదిత్య హృదయం చదివితే మంచిది. 

మకరం

విశేషమైన ఏకాగ్రతతో ప్రయత్నాలు సిద్ధిస్తాయి. తోటి వారి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. చతుర్దంలో చంద్ర సంచారం వ్యతిరేక ఫలితాలను ఇస్తోంది. మనశ్శాంతి కొరకై చంద్ర ధ్యానం చేయండి. 

కుంభం

తలపెట్టిన కార్యాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగస్తులకు శుభకాలం. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఒక వార్త మీ ఇంట ఆనందాన్నిఇస్తుంది. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభదాయకం. 

మీనం

మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించి విజయంసాధిస్తారు. తోటి వారి సహకారంతో పనులు చక్కగా పూర్తవుతాయి. కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసే ఆలోచనలు ఫలిస్తాయి. ద్వితీయంలో చంద్రబలం తక్కువగా ఉంది. మనశ్శాంతి లోపించకుండా కాపాడుకోవాలి. సూర్య స్తుతి మంచి ఫలితాన్నిఇస్తుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని