Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (12/06/24)

ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 12 Jun 2024 00:23 IST

మేషం

మనఃశుద్ధితో  చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఆర్థికంగా అనుకూల కాలం. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.

వృషభం

గ్రహబలం మిశ్రమంగా ఉంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. ఆరోగ్య నియమాలను పాటించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శుభకరం. 

మిథునం

మంచికాలం. మానసిక ప్రశాంతత ఉంది. బుద్ధిబలంతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కలహాలకు తావివ్వరాదు. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.

కర్కాటకం

మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక  వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

సింహం

ప్రారంభించబోయే పనిలో చిన్న చిన్న ఆటంకాలు అధికం అవుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి.  ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కనకధారాస్తవం చదవాలి. 

కన్య

ప్రారంభించిన పనులలో  ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలంతో ముందుకు సాగాలి. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. శివారాధన చేయాలి.

తుల

మనఃస్సౌఖ్యం ఉంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాలం సర్వదా రక్షిస్తోంది. ఈశ్వర దర్శనం శ్రేయస్కరం.

వృశ్చికం

దైవబలం ఉంది. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఒక వ్యవహారంలో నైతికవిజయం సాధిస్తారు. ఆర్ధికంగా మేలైన ఫలితాలు ఉన్నాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ ఆరాధన మరింత శుభప్రదం.

ధనుస్సు

ప్రారంభించిన పనులను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయులతో వాగ్వాదాలకు పోవద్దు. భయాందోళనలను విడనాడాలి. చెడ్డవాళ్లతో సావాసం చేయడం వల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. దుర్గాస్తుతి చదవాలి.

మకరం

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. మాట పట్టింపులకు పోవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీలక్ష్మీదేవి ఆరాధన శ్రేయోదాయకం.

కుంభం

ఉత్సాహంగా పనిచేసి చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది.

మీనం

ప్రారంభించిన కార్యక్రమాల్లో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వకండి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం మేలు చేస్తుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని