Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/06/24)

ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Updated : 01 Jun 2024 00:26 IST

మేషం

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

వృషభం

మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. ఈశ్వర నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

మిథునం

మీమీ రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

కర్కాటకం

మనోధైర్యంతో చేసే పనులు వెంటనే పూర్తవుతాయి. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్త్రలాభం ఉంది. ఆర్థికంగా ఎదగడానికి పునాదులను నిర్మిస్తారు. విష్ణు నామాన్ని జపించండి.

సింహం

తోటివారి సహకారంతో సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. ఇష్టదైవం నామాన్ని జపిస్తే మేలైన ఫలితాలు వస్తాయి.

కన్య

మనఃస్సౌఖ్యం కలదు. సౌభాగ్య సిద్ధి ఉంది. నలుగురిలో గొప్పపేరు సంపాదిస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి,సమయాలు తగ్గుతాయి. శ్రీలక్ష్మీ దర్శనం శుభప్రదం.

తుల

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. ఆదిత్య హృదయం చదవాలి.

వృశ్చికం

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని  కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. గణపతి స్తోత్రం చదవండి, మంచి జరుగుతుంది.

ధనుస్సు

ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో విబేధాలు రావచ్చు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.

మకరం

ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

కుంభం

ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శ్రీలక్ష్మీస్తుతి చదవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

మీనం

ముఖ్యమైన వ్యవహారంలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఆ గుర్తింపు మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. కుటుంబసభ్యుల అభిప్రాయాలను కొట్టిపారేయకండి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని