Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/03/24)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది.  డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 25 Mar 2024 00:06 IST

మేషం

ఉద్యోగులకు అనుకూల కాలం. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదేవతారాధన శుభప్రదం. 

వృషభం

మధ్యమ ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో  ఓర్పు సహనం పట్టుదల అవసరం. ఆర్థికంగా మిశ్రమఫలితాలున్నాయి. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృథాచేయకండి. ఇష్టదేవతా ఆరాధన శక్తినిస్తుంది.

మిథునం

అవరోధాలున్నాయి. ఓర్పుతో ముందుకు సాగాలి. మాట పట్టింపులకు పోకండి. మొహమాటం వల్ల  లేనిపోని సమస్యలున్నా కొనితెచ్చుకోకండి. ఎవ్వరినీ అతిగా నమ్మకండి. సుబ్రహ్మణ్యస్వామి  స్తోత్రం చదివితే మంచిది.

కర్కాటకం

సంతోషకరమైన వార్తలను వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజనసౌఖ్యం ఉంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

సింహం

చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి . మీ స్వధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆంజనేయ స్వామి సందర్శనం  శుభప్రదం.

కన్య

లక్ష్యాలు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ధన, వస్త్ర లాభాలు కలుగుతాయి. సూర్య నమస్కారం వల్ల మంచి జరుగుతుంది.

తుల

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్నిపెంచుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

వృశ్చికం

ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. చేసేపనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయాన్ని సధ్వినియోగం చేసుకోండి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

మకరం

చిత్తశుద్ధి తో చేసేపనులు మంచినిస్తాయి. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోరాదు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర విషయాలతో  సమయం వృథా కానీయకండి. నవగ్రహ ధ్యానం శుభాన్నిస్తుంది.

కుంభం

తోటివారి సహకారంతో ముందుకు సాగండి మంచి జరుగుతుంది. సంపూర్ణ అవగాహణతో ముందుకు సాగి మంచి నిర్ణయాలు తీసుకుంటారు.   తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. అష్టమ చంద్రుడు అనుకూలించట్లేదు. చంద్ర  ధ్యానం మంచి ఫలితాలను ఇస్తుంది.

మీనం

బుద్ధిబలం బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. లక్ష్మీధ్యానం శుభప్రదం.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని