Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/03/2024)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 11 Mar 2024 00:01 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మిశ్రమ కాలం. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. దుర్గా ధ్యాన శ్లోకం చదివితే అన్నివిధాలా మంచిది.

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

మనోధైర్యంతో ప్రయత్నించి అనుకున్న పనులను సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. బంధు,మిత్రులను కలుస్తారు. చంద్రశేఖరాష్టకం చదివితే మంచిది.

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే  ప్రయత్నం చేస్తారు. మానసికంగా దృఢంగా  ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది.

మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక  సమస్య మీ మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.

చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.

ప్రారంభించిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. అలసట పెరుగుతుంది. మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చంద్రధ్యానం మేలు చేస్తుంది.

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పనులను విషయాలను సాగదీయకండి, త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేసుకోండి. ఆదిత్యహృదయం చదవడం మంచిది.

 

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. తోటివారిని కలుపుకొనిపోవాలి. ముఖ్య విషయాల్లో అనుభవం ఉన్నవారిని సంప్రదించండి. ఈశ్వరధ్యానం మేలు చేస్తుంది.

శుభ కాలం. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు. శివారాధన శుభప్రదం.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని