Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/03/2024)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 13 Mar 2024 00:01 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ప్రయత్నకార్యసిద్ధి ఉంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శివారాధన శుభప్రదం.

శారీరకశ్రమ పెరుగుతుంది. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు సొంతం అవుతాయి. బంధువులతో బేధాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శ్రేయస్కరం.

అనుకూల సమయం. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. విష్ణుసహస్రనామ పారాయణ మంచి ఫలితాలను ఇస్తుంది.

శుభ సమయం. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. శివారాధన శుభప్రదం.

అనుకున్నది సాధించేవరకు పట్టుదల తగ్గకుండా చూసుకోవాలి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విందు,వినోదాల్లో పాల్గొంటారు. సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే  పనులను ప్రారంభిస్తే మంచిది. ఇష్టదైవారాధన శుభప్రదం.

ప్రారంభించబోయే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. బంధు,మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. నలుగురికీ ఉపయోగపడే పనులను చేసి తోటి వారి నుంచి ప్రశంసలను అందుకుంటారు. గణపతి మంత్రం చదివితే మంచిది.

బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. పనులను వాయిదా వేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మీ మీ రంగాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. విజయావకాశాలు మెరుగవుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

స్థిరమైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. మనఃస్సౌఖ్యం ఉంది. ఆర్థికంగా శుభకాలం. గాయత్రీ మంత్రాన్ని జపించాలి.

 

ఆశించిన ఫలితాలను రాబట్టడానికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. సమయపాలన పాటించండి. బలమైన ఆహారంతో పాటు విశ్రాంతి అవసరం అవుతాయి. ప్రయాణాలలో ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీరామ నామాన్ని జపించండి.

తోటివారి సహాయ సహకారాలు ఉంటాయి. ధనలాభం ఉంది. శత్రువులు తగ్గుతారు. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిరచిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. ప్రయాణ అనుకూలత ఉంది. కులదైవారాధన శుభప్రదం.

తోటివారి ఆదరాభిమానాలు ఉంటాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. దుర్గాఅష్టోత్తరం చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని