Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/03/2024)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది.  డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 14 Mar 2024 00:10 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నతస్థితికి చేరుకుంటారు. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి. సకాలంలో ఆదుకునేవారు ఉన్నారు. శివారాధన శుభప్రదం.

కీలక వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం చదవడం మంచిది. 

ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. స్థిరనిర్ణయాలతో చేసే పనులు ఫలిస్తాయి. దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది.

మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృథా చేయకండి. ఈశ్వరదర్శనం చేయడం మంచిది.

అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్నిపెంచుతాయి. కీలక  వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.

కీలక వ్యవహారాలలో  ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందుజాగ్రత్తతో వ్యవహరించాలి. బంధు,మిత్రుల వలన మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. శ్రీసుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం.

ఉన్నతమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

మీ మీ రంగాలలో పరిస్థితులు క్రమక్రమంగా మీకు అనుకూలంగా మారతాయి. ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తిచేస్తారు. సంకల్పం నెరవేరుతుంది. మిత్రబలం పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు మేలైన కాలం. దైవారాధన మానవద్దు.

 

ప్రారంభించిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని వ్యవహారాలలో బుద్దిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.

మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనఃస్సౌఖ్యం ఉంది. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఆదిత్యహృదయం చదవడం మంచిది.

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు  ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని