Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/03/23)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది.  డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 27 Mar 2023 00:46 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

కార్యవిఘ్నాలు లేకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి.  మనః పీడ పెరుగుతుంది. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వలన  మంచి ఫలితాలు కలుగుతాయి.

సౌభాగ్య సిద్ధి ఉంది. ఆత్మీయుల  సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదేవతా స్తుతి  మంచిది.

ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి.  బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోరాదు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.

విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది.  ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ నామస్మరణ మంచిది.

కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది.  పొదుపు పాటించాలి. స్థానచలన సూచితం. కీలక వ్యవహారాల్లో  ఓర్పుగా వ్యవహరించండి. శివనామాన్ని జపించాలి.

ఉద్యోగంలో పై అధికారులతో  జాగ్రత్తగా ఉండాలి.  కుటుంబ సభ్యులు మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి.  మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. శివనామాన్ని జపించాలి.

మధ్యమ ఫలితాలున్నాయి. పక్కవారిని కలుపుకుపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి .  అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి.  లక్ష్మీధ్యానం శుభప్రదం.

అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు.  తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. విందూ వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాదన మానవద్దు. శివారాధన శుభప్రదం.

 

శ్రమకు తగిన  ఫలితం ఉంటుంది. పెద్దలనుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు.  తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి.  వేంకటేశ్వరుడిని ఆరాధించడం వలన  శుభ ఫలితాలను పొందగలుగుతారు.

శరీర సౌఖ్యం ఉంది. యశస్సు వృద్ధి చెందుతుంది .  ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది.  ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన మేలు చేస్తుంది.

ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ప్రక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారున్నారు. విజ్ఞానపరంగా ఎదుగుతారు.  ముఖ్యమైన విషయాల్లో ఓర్పు అవసరం. శివనామస్మరణ చేయడం ఉత్తమం.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని