Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/03/24)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.   

Published : 04 Mar 2024 00:07 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ముఖ్యవిషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. శత్రువుల జోలికి పోకుండా ఉండటం మంచిది. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చంద్రధ్యానం శుభప్రదం.

 ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కార మార్గం దొరుకుతుంది. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. కుటుంబసభ్యుల సలహాలు బాగా ఉపకరిస్తాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. ఈశ్వరారాధన శుభప్రదం.

పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. అర్థలాభం ఉంది. కీలక విషయాల్లో సొంతనిర్ణయాలు లాభాన్నిస్తాయి. అభివృద్ధికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

చంచల స్వభావం వల్ల  ఆటంకాలు పెరుగుతాయి. చేయని పొరపాటుకు నిందపడాల్సివస్తుంది. అభివృద్ధికై మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. దుర్గారాధన మంచినిస్తుంది.

మంచి మనస్సుతో చేసే పనులు విశేష ఫలాన్నిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. కుటుంబ చిక్కులు ఇబ్బంది పెడతాయి. ఋణ సమస్యలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

మనస్సౌఖ్యం ఉంది. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనశాంతి లోపించకుండా జాగ్రత్తపడండి. వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. బలమైన ప్రయత్నంతో అనుకున్నది సాధిస్తారు.  ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రీ రామ నామస్మరణ మేలు చేస్తుంది.

ఒక వ్యవహారంలో  కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు తప్పకపోవచ్చును. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. దుర్గామాత  శ్లోకాలను  చదువుకోవడం మంచిది.

 

మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. ముఖ్యమైన సమయంలో సహాయం అందుతుంది. బాధ్యతలను గుర్తెరిగి పనిచేయండి చక్కటి శుభఫలితాలను పొందుతారు. శ్రీ విష్ణు సందర్శనం ఉత్తమం.

మంచిపనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి.  స్థిర నిర్ణయాలు విజయాన్నిస్తాయి. గోవింద నామాలు పఠించడం మంచిది.

ధర్మసిద్ధి ఉన్నది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థలాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సమర్థవంతంగా వాటిని ఎదుర్కొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. సూర్య ధ్యానం శుభప్రదం.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని