Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/03/2024)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది.  డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 09 Mar 2024 00:15 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మనోబలంతో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. లాభంలో చంద్రబలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈశ్వర ఆరాధనతో మంచి ఫలితాలు వస్తాయి.

ప్రారంభించబోయే పనిలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ముఖ్యమైన పనులు చేసే ముందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. దైవబలం రక్షిస్తుంది. వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శుభకార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. లక్ష్మీస్థితి అదృష్టాన్ని ఇస్తుంది.

మీ మీ రంగాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు. నిండు మనసుతో పనులను పూర్తిచేస్తారు. ప్రశంసలను అందుకుంటారు. తోటివారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. నవమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. ఎవరినీ అతిగా నమ్మిమోసపోవద్దు. దుర్గాధ్యానం చేస్తే మంచిది.

కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. నిరుత్సాహపడకుండా పనిచేస్తే విజయానికి చేరువవుతారు. విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు. అష్టమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శ్రీసూర్యనారాయణమూర్తి సందర్శనం శ్రేయోదాయకం.

ప్రారంభించబోయే పనిలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ఎదుర్కొంటారు. విజయం వరిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. ఎవరినీ అతిగా నమ్మి మోసపోకండి. ప్రయాణంలో జాగ్రత్త. శివ ధ్యానం చేస్తే మంచిది. 

చక్కటి ఆలోచన విధానంతో భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో కీలకనిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మాట పట్టింపులకుపోవద్దు. శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

సంపూర్ణ ఆత్మబలంతో విజయసిద్ధి కలదు. మీ మీ రంగాల్లో ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. పంచమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. అస్థిర నిర్ణయాల వల్ల మీ మీద ఒత్తిడి పెరుగుతుంది. అపార్థాలకు తావివ్వకండి. ఆదిత్యహృదయం చదివితే మంచిది. 

విశేషమైన ఏకాగ్రతతో చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి. తోటివారి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. చతుర్థంలో చంద్రసంచారం వ్యతిరేక ఫలితాలను ఇస్తోంది. మనఃశ్శాంతి కోసం చంద్రధ్యానం చేయండి. 

మీదైన రంగంలో పట్టుదల, ఏకాగ్రత మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించే ముందు కుటుంబసభ్యుల అంగీకారం తప్పనిసరి. ముఖ్యమైన విషయాల్లో ముందుచూపుతో వ్యవహరించడం ద్వారా ఇబ్బందులు తొలుగుతాయి. గణపతిని స్మరిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

 

మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించి విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో పనులు చక్కగా పూర్తవుతాయి. కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసే ఆలోచనలు ఫలిస్తాయి. ద్వితీయంలో చంద్రబలం తక్కువగా ఉంది. మనఃశ్శాంతి లోపించకుండా కాపాడుకోవాలి. సూర్యస్తుతి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ప్రారంభించిన కార్యక్రమాలలో ఆశించిన ఫలితాలు వస్తాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగస్తులకు శుభకాలం. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభదాయకం.

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. పెద్దలతో మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు మనసులో అనుకుని మాట్లాడటం మంచిది. ద్వాదశంలో చంద్రుడు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్నారు. మనఃశ్శాంతి కోసం ఈశ్వర ఆరాధన చేయండి.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని