Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)

ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 16 May 2024 00:22 IST

మేషం

అవరోధాలు ఉన్నాయి. ఓర్పుతో ముందుకు సాగాలి. మాట పట్టింపులకు పోకండి. మొహమాటం వల్ల లేనిపోని సమస్యలను కొనితెచ్చుకోకండి. ఎవరినీ అతిగా నమ్మకండి. శ్రీసుబ్రహ్మణ్యస్వామి స్తోత్రం చదివితే మంచిది.

వృషభం

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో  ఓర్పు, సహనం, పట్టుదల అవసరం. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. ఇష్టదేవతా ఆరాధన శక్తిని ఇస్తుంది. 

మిథునం

ఉద్యోగులకు అనుకూల కాలం. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదేవతారాధన శుభప్రదం. 

కర్కాటకం

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. శివుడిని ఆరాధిస్తే మంచిది.. 

సింహం

సంతోషకరమైన వార్తలను వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజనసౌఖ్యం ఉంది.శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.

కన్య

బాధ్యతలు పెరుగుతాయి. ధర్మసిద్ధి ఉంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. దుర్గాదేవి ఆరాధన శక్తిని ఇస్తుంది.

తుల

చిత్తశుద్ధితో చేసే పనులు ఫలప్రదం అవుతాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రీఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.

వృశ్చికం

ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు

చిత్తశుద్ధితో చేసే పనుల వల్ల అంతా మంచే జరుగుతుంది. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర విషయాలతో సమయాన్ని వృథా కానీయకండి. నవగ్రహ ధ్యానం శుభాన్ని ఇస్తుంది.

మకరం

తోటివారి సహకారంతో ముందుకు సాగండి, మంచి జరుగుతుంది. సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి.అష్టమ చంద్రుడు అనుకూలించట్లేదు. చంద్రధ్యానం మంచి ఫలితాలను ఇస్తుంది.

కుంభం

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

మీనం

బుద్ధిబలం బాగుంటుంది. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. శ్రీలక్ష్మీధ్యానం శుభప్రదం.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని