Today Horoscope in Telugu:: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)

ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది.  డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Updated : 21 May 2024 00:15 IST

మేషం

మానసికంగా ధృడంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించాలి.

వృషభం

మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శ్రీ శివపార్వతులను పూజించడం వలన శుభ ఫలితాలను పొందగలుగుతారు.

మిథునం

ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా ధృడంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

కర్కాటకం

చేపట్టే పనుల్లో శ్రమ ఫలిస్తుంది. కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. మనసికంగా ఉల్లాసంగా ఉంటారు. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. శనిధ్యానం శుభప్రదం.

సింహం

ముఖ వ్యవహారాలలో   లాభాలు పొందుతారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి. శివ సందర్శనం శుభప్రదం.

కన్య

మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

తుల

అవసరరానికి తగిన సహాయం అందుతుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి, అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం మీకు ఉంటుంది. గోవింద నామాలు చదవటం మంచిది.

వృశ్చికం

 చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. నవగ్రహ శ్లోకం చదవడం మంచిది.

ధనుస్సు

మంచి ఫలితాలున్నాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది.

మకరం

తోటి వారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధి లభిస్తుంది. శివ నామస్మరణ మేలు చేస్తుంది.

కుంభం

శారీరక శ్రమ పెరగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.

మీనం

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. తోటి వారిని కలుపుకొని పోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. మానసికంగా ధృడంగా ఉంటారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. దైవారాధన మానవద్దు.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని