Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/05/24)

ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 23 May 2024 00:21 IST

మేషం

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు కొన్నింటిని అమలు చేస్తారు. ముఖ్య విషయాల్లో బంధు,మిత్రుల సలహాలు అవసరం అవుతాయి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. శ్రీలక్ష్మీగణపతి ధ్యానం శుభప్రదం.

వృషభం

శుభ ఫలితాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన పనిని  విజయవంతంగా  పూర్తి చేస్తారు. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఈశ్వర సందర్శనం చేస్తే మంచి జరుగుతుంది.

మిథునం

తోటివారి సహకారంతో  మేలు జరుగుతుంది. ధనలాభం ఉంది. శత్రువులు తగ్గుతారు. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిరచిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. ప్రయాణ అనుకూలత ఉంది. కులదైవారాధన శుభప్రదం. 

కర్కాటకం

శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేయకండి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. 

సింహం

ప్రారంభించిన కార్యక్రమాలలో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

కన్య

శుభ సమయం. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. మీ మీ రంగాల్లో స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగి మంచి ఫలితాలు సాధిస్తారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.   

తుల

బాగా ఆలోచించి పనులను చేయాలి. మిత్రులతో కలసి ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. విష్ణు సహస్రనామ పారాయణ మంచి ఫలితాలను ఇస్తుంది.

వృశ్చికం

శ్రమ ఫలిస్తుంది. కార్యసిద్ధి ఉంది. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

ధనుస్సు

మీ మీ రంగాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. విజయావకాశాలు మెరుగవుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

మకరం

బంధు,మిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులను చేసి తోటి వారి నుంచి  ప్రశంసలను అందుకుంటారు. గణపతి మంత్రం చదివితే మంచిది.

కుంభం

స్థిరమైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. మనఃస్సౌఖ్యం ఉంది. ఆర్థికంగా శుభకాలం. గాయత్రీ మంత్రం జపించాలి.

మీనం

ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల అంతా మంచి జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని