Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/05/2024)

ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది.. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..

Updated : 30 May 2024 02:58 IST

మేషం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం చదవాలి.

వృషభం

సమాజంలో గొప్ప పేరుప్రతిష్టలు సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మధుర క్షణాలను గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనామం చదివితే మేలు జరుగుతుంది.

మిథునం

కీలకమైన వ్యవహారాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

కర్కాటకం

శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ శుభప్రదం.

సింహం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. శ్రీ ఆంజనేయస్వామి దర్శనం మేలు చేస్తుంది.

కన్య

ప్రారంభించబోయే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. సంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

తుల

మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలకమైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.

వృశ్చికం

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి పనిని కుటుంబంతో చర్చించిన తర్వాతే మొదలుపెట్టాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

ధనుస్సు

అనుకూల సమయం. తోటివారి సహకారం అందుతుంది. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. అందరి మన్ననలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.

మకరం

ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.

కుంభం

పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీ మనసుకు ఇబ్బంది కలిగిస్తుంది. అనుకోని కలహసూచన ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానకండి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

మీనం

పట్టుదలతో విజయం సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామం జపించడం ఉత్తమం.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని