Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/11/2023)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 29 Nov 2023 00:20 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ప్రారంభించిన పనుల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఒక ముఖ్యమైన సమస్యను చాకచక్యంగా పరిష్కరిస్తారు. గురువుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి.

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ  దైవానుగ్రహంతో వాటిని సమర్థంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

మీ మీ రంగాల్లో సమర్థంగా ముందుకు సాగి విజయం సాధిస్తారు. తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు. సమాజంలో మంచి పేరుప్రఖ్యాతలు వస్తాయి. శ్రీసుబ్రహ్మణ్య స్వామి సందర్శనం శుభప్రదం.

ద్వాదశ చంద్రబలం అనుకూలంగా లేదు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. తోటివారి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

కీలక విషయాలలో అనుకున్న ఫలితాలు వస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే బాగుంటుంది.

ప్రారంభించిన పని విజయవంతంగా పూర్తవుతుంది. మీ బుద్ధిబలంతో సమస్యలు తొలుగుతాయి. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మేలు.

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. వృత్తి,ఉద్యోగాల్లో మేలైన ఫలితాలు ఉంటాయి. శత్రువులపై నైతిక విజయం సాధిస్తారు. ముఖ్య విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే వివాదాలు చుట్టుముడతాయి. ఎవరినీ అతిగా నమ్మకండి. శివారాధన శుభప్రదం.

ప్రయత్నకార్యసిద్ధి కలదు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విందు,వినోదాల్లో ఆనందంగా గడుపుతారు.బంధుప్రీతి కలదు. ఇష్టదైవ నామస్మరణ శుభప్రదం.

సప్తమ చంద్ర దృష్టి అనుకూలిస్తోంది. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ధన,ధాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. తోటి వారి సహకారంతో సత్ఫలితాలు సాధిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శ్రీలక్ష్మీ నామాన్ని జపించడం ఉత్తమం.

 

ప్రారంభించిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధు,మిత్రుల సహకారం మేలు చేస్తుంది. నవగ్రహస్తోత్రం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.

చిత్తశుద్ధితో పనిచేయాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విఘ్నాలను కలిగించేవారు పక్కనే ఉంటారు. ఆదిత్య హృదయం చదివితే మంచిది.

పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో చక్కటి ఫలితం సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు.దుర్గాదేవి సందర్శనం శుభప్రదం.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు