Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (12/02/24)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.   

Updated : 13 Feb 2024 00:04 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మీ నిబద్ధతే  మీ విజయానికి మూలం. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతమైన ఆలోచనలతో ముందుకు సాగితే అంతా మేలు జరుగుతుంది. విష్ణు నామస్మరణ శుభానిస్తుంది.

ఉత్సాహంగా పని చేస్తే గొప్పవారవుతారు. అజాగ్రత్త వద్దు. కీలక వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. అవసరానికి మించి ఖర్చు చేస్తారు. కొన్ని సందర్భాల్లో శత్రువులను కూడా కలుపునకుపోవడం మంచిది. హనుమత్ ఆరాధన శుభప్రదం.

శుభయోగాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మానసిక  శక్తినిస్తుంది. ఆదిత్య హృదయం చదివితే మంచిది. 

మీ శ్రమ ఫలిస్తుంది. బంధువుల సహకారం ఉంటుంది. లక్ష్యాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే శుభ ఫలితాలు వస్తాయి. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.  శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేస్తే మంచిది.

.

ఒక శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాలలో అధికారుల ఆశీస్సులు లభిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించాలి.

మనఃస్సౌఖ్యం ఉంది. మీ బుద్ధిబలంతో పనులను పూర్తి చేయగలుగుతారు. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. కుల దైవ సందర్శనం శుభాన్నిస్తుంది.

ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యులతో  చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివిగా ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం  పారాయణ చేయాలి.

ప్రారంభించిన పనుల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్యమైన విషయాల్లో  మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శివ స్తోత్రం పఠిస్తే మంచిది.

 

ఇష్టసిద్ధి ఉంది. ముఖ్యమైన వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు.  ప్రయాణాల్లో జాగ్రత్త . దుర్గా స్తోత్రం పఠించాలి.

మిశ్రమకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆపదలు పెరుగుతాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కనకధారాస్తవం పఠించాలి.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శుభ ఫలితాలున్నాయి. నూతన పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది. దైవారాధన మానవద్దు.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని