Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/06/24)

ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 10 Jun 2024 00:22 IST

మేషం

అదృష్టఫలాలు అందుతాయి. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. అవసరానికి సాయం అందుతుంది. చంద్ర ధ్యానం  పఠించాలి.

వృషభం

ముఖ్య వ్యవహారాలలో లాభాలు పొందుతారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. శివ సందర్శనం శుభప్రదం.

మిథునం

చేపట్టే పనుల్లో శ్రమ ఫలిస్తుంది. కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. మనసికంగా ఉల్లాసంగా ఉంటారు. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. శనిధ్యానం శుభప్రదం.

కర్కాటకం

ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం. 

సింహం

మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. శివపార్వతులను పూజించడం వలన శుభ ఫలితాలను పొందగలుగుతారు.

కన్య

మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

తుల

అవసరానికి తగిన సహాయం అందుతుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి, మంచి నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులకు మేలు చేస్తుంది. గోవిందా నామాలు చదవటం మంచిది.

వృశ్చికం

శారీరక శ్రమ పెరగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.

ధనుస్సు

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. తోటి వారిని కలుపుకోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. దైవారాధన మానవద్దు.

మకరం

మంచి ఫలితాలున్నాయి. విందు, వినోద, శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది.

కుంభం

తోటి వారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధి లభిస్తుంది. ధర్మసిద్ధి ఉంది.  ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి . శివ నామస్మరణ మేలు చేస్తుంది.

మీనం

 చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. నవగ్రహ శ్లోకం చదవడం మంచిది.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు