MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్లపై దిల్లీ హైకోర్టులో విచారణ

మద్యం కుంభకోణం వ్యవహారంలో ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.

Published : 27 May 2024 15:06 IST

దిల్లీ: మద్యం కుంభకోణం వ్యవహారంలో ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఆమె తరఫు న్యాయవాది విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా కవితను అరెస్టు చేశారని వాదించారు. మహిళలను విచారించే విషయంలో స్పష్టత కోసం సీఆర్‌పీసీలోని అంశాలను లేవనెత్తుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశామని, దానిపై విచారణ జరుగుతుండగానే ఈడీ, సీబీఐ సమన్లు ఇచ్చాయని కోర్టుకు వివరించారు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టులో ప్రస్తావించగా.. తదుపరి విచారణ వరకు సమన్లు ఇవ్వబోమని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ప్రకటన చేశారని అన్నారు. అంతలోనే ఒక రోజు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించి, అదే రోజు సాయంత్రానికి అరెస్టు చేశారని చెప్పారు.

ఒక పార్టీలో ముఖ్య నాయకురాలిగా, ఎమ్మెల్సీగా ఉన్న ఆమెపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టి అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మహిళ హక్కులను కాలరాసే విధంగా దర్యాప్తు సంస్థలు వ్యవహరించాయని, మొబైల్‌ ఫోన్లు, డిజిటల్‌ ఆధారాలను ధ్వంసం చేశాయని ఆరోపించారు. కేసులో అన్ని వివరాలను పరిశీలించి బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. అయితే, దీనిపై తమ వాదనలు వినిపించేందుకు ఈడీ తరఫు న్యాయవాది గడువు కోరారు. మంగళవారం తగిన డాక్యుమెంట్లతో కోర్టుకు భౌతికంగా హాజరై వాదనలు వినిపిస్తామన్నారు. ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు