Yadadri: యాదాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటల సమయం

వేసవి సెలవులు, వారాంతం కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Published : 26 May 2024 11:58 IST

యాదగిరిగుట్ట: వేసవి సెలవులు, వారాంతం కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. మెట్ల దారిలో రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులుదీరారు. తమ కోర్కెలు తీరాలని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. ప్రసాద విక్రయ శాల, శ్రీసత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్లాండ్‌లో భక్తుల రద్దీ నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని